యూత్ ఏషియన్ కబడ్డీ క్రీడలకు నల్లమల్ల బిడ్డ
On

విశ్వంభర, కల్వకుర్తి; బెహరాన్ దేశంలో జరుగుతున్న యూత్ ఏసియన్ కబడ్డీ క్రీడలకు భారత కబడ్డీ జట్టు ఎంపిక శిక్షణకు నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల ప్రాంతం పదిర గ్రామానికి చెందిన నందిని భారత కబడ్డీ జట్టు శిక్షణ కు ఎంపిక కావడం జరిగింది. ఈ భారత ప్రాబబుల్స్ జట్టుకు ఎంపికైన నందిని నాగర్ కర్నూల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉర్కొండ మండల కేంద్రంలో అభినందన సభ ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ నాగర్ కర్నూల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎం జనార్దన్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కురుమూర్తి గౌడ్ పాల్గొన్నారని జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్ తెలిపారు.