ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం -ఎస్సై యాదయ్య

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం -ఎస్సై యాదయ్య

విశ్వంభర, చింతపల్లి : వేసవిలో దాహం తీర్చేందుకు చలి వేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని చింతపల్లి ఎస్సై భీమనమోని యాదయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద చింతపల్లి ప్రెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిఆర్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎస్సై భీమనమోని యాదయ్య, వివిఆర్ ఫౌండేషన్ చైర్మన్ వరికుప్పల వెంకట్ రాములు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై భీమనమోని యాదయ్య మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చిన ప్రెస్ క్లబ్ సభ్యులను వారికి సహకరించిన వివిఆర్ ఫౌండేషన్ వారిని అభినందించారు. చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని వారు అన్నారు. ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ప్రెస్ క్లబ్ సభ్యులు వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు.. ఈ కార్యక్రమంలో కుంభం పుల్లారెడ్డి, కుంభం శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి మురళి, గోవింద్ రవి, వెన్నం శేఖర్, పున్న భీమేశ్వర్, ఖాలేద్, ఎర్ర జగన్, నల్ల శంకర్, ఉప్పల యాదయ్య, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అలీ, గౌరవ అధ్యక్షులు బాబన్న, కోశాధికారి గోవిందు ప్రసాద్, కమిటీ సభ్యులు సతీష్, రేణుక తదితరులు పాల్గొన్నారు

Tags:  

Advertisement

LatestNews

విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం - ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
చండూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం - డా. కోడి శ్రీనివాసులు సహకారంతో పేద ప్రజలకు వైద్య సేవలు 
ఘనంగా చండూర్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ - -ఆవిష్కరించిన  మున్సిపల్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ 
మంత్రిని కలిసిన పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ , వైస్ చైర్మన్  - పోచంపల్లి బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం 
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 
AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు