మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు చిరస్మరణీయం

సమ సమాజ నిర్మాణవేత్త,గొప్ప సాంఘిక సంస్కర్త :రాపోలు రాముడు

మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు చిరస్మరణీయం

విశ్వంభర/ మేడిపల్లి: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల  కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు హాజరై మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫూలే దంపతులను గుర్తు చేశారు. వారు సమ సమాజం కోసం చేసిన సాంఘిక సంక్షేమ, సంస్కృతిక కార్యక్రమాలను ఏనాటికి మరువబోమన్నారు. ఈ ఏప్రిల్ మాసంలోనే ఎంతోమంది మహనీయులు జన్మించారని తెలిపారు. 11 ఏప్రిల్ 1827న జన్మించిన జ్యోతి రావు పూలే తాను మరణించినా కానీ నేటికీ అందరిచే పూజింపబడుతున్నాడని కొనియాడారు. పూలే దంపతులు మహిళ  విద్య ఉన్నతికే కృషిచేసిన పుణ్య దంపతులన్నారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి బడుగు బలహీన వర్గాలకు బాట చూపిన మహానీయులు అన్నారు. ఈ కార్యక్రమంలో సందీప్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ రాపోలు సువర్ణ, ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షులు అబ్రహం లింకన్, ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి, ఫెడరేషన్ అడ్వైజర్స్, మెంబర్స్, మహిళా నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews

'అమృత వర్షిణి ఆర్ట్స్ '' సినీ సంగీత స్వర సమీరాలు సీజన్ -8
భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి వారినీ దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత, ఎంపీ వద్దిరాజు 
తెలంగాణ టీడీపీ రాష్ట్ర నాయకులు గూడపాటి శరత్ ను కలిసిన ఏలే మహేష్ నేత 
సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షడు డా. యర్రమాద కృష్ణారెడ్డి నీ కలిసిన ఏలే మహేష్ నేత 
కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జనరల్ సెక్రెటరీ డా. కొదుమూరి దయాకర్ రావు నీ కలిసిన ఏలే మహేష్ నేత 
Sr జర్నలిస్ట్ , విశ్వంభర దినపత్రిక బ్యూరో పోతుగంటి వెంకటరమణ కు  ఆహ్వానం 
పద్మశాలి సంఘం అధ్యక్షడు పున్న గణేష్ నేత కు ఆహ్వానం