కుటుంబ సర్వేలో పనిచేసిన సిబ్బందికి పారితోషికాలు వెంటనే చెల్లించాలి - టీఎస్‌యుటిఎఫ్ డిమాండ్

కుటుంబ సర్వేలో పనిచేసిన సిబ్బందికి పారితోషికాలు వెంటనే చెల్లించాలి - టీఎస్‌యుటిఎఫ్ డిమాండ్

విశ్వంభర, భద్రాచలం : గత సంవత్సరం నవంబర్‌లో నిర్వహించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పనిచేసిన ఎన్యుమరేటర్లకు, సూపర్వైజర్లకు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇప్పటికీ పారితోషికాలు చెల్లించలేదని టీఎస్‌యుటిఎఫ్ (తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫ్రంట్) మండల కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) బీ. నారాయణను టీఎస్‌యుటిఎఫ్ ప్రతినిధి బృందం కలిసి పారితోషికాల చెల్లింపుకు విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా టీఎస్‌యుటిఎఫ్ జిల్లా నాయకుడు ఎస్. విజయ్ కుమార్ మాట్లాడుతూ, “ఇతర బాధ్యతల్ని పక్కనపెట్టి ప్రభుత్వ పిలుపుతో కుటుంబ సర్వేలో పాల్గొన్న సిబ్బందికి ఇప్పటి వరకూ పారితోషికాలు ఇవ్వకపోవడం అన్యాయమని,” వెంటనే వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎంపీడీవో బీ. నారాయణ హామీ ఇచ్చారు.

Tags:  

Advertisement

LatestNews