లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

విశ్వంభర, మెట్ పల్లి : జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం మెట్లచిట్టాపూర్ గ్రామంలో మెట్టుపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మెట్లచిట్టాపూర్ గ్రామం లో ఉచిత కంటి శిబిరం ఘనంగా జరిగింది. లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఇల్లెందుల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ  లయన్స్ క్లబ్ మెట్ పల్లి వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం రేకుర్తి హాస్పిటల్ వైద్యులతో  కంటి పరీక్షలు చేశారని దాదాపు 300 మంది  కంటి వైద్య శిబిరానికి హాజరయ్యారు.  ఇందులో 50. మందికి ఆపరేషన్ అవసరం ఉన్న వారికి లయన్స్ క్లబ్ నుండి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి రేకుర్తి హాస్పిటల్కు పంపించడం జరిగిందని అక్కడ ఆపరేషన్ చేసి అనంతరం తిరిగి మెట్లచిట్టాపూర్ గ్రామం కు ఉచితంగానే బస్సులో తీసుకు వస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ కంటి వైద్య పరీక్షలు చేయించుకొని లబ్ధి పొందాలని అదేవిధంగా  సంవత్సరం ఆరు సార్లు కంటి వైద్య శిబిరం రెండుసార్లు గుండె వైద్య శిబిరం చేస్తామని ఇటీవల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వైద్య శిబిరం ఏర్పాటు చేశామని పట్టణ గ్రామీణ ప్రజలు అత్యధిక మంది సద్వినియోగం చేసుకున్నారని అన్నారు.  
 ఈ కార్యక్రమంలో  లయన్స్ క్లబ్ అధ్యక్షులు  ఇల్లెందుల శ్రీనివాస్, సెక్రెటరీ గూండా రాకేష్ క్యాషియర్ నాంపల్లి వేణు గోపాల్,Z C గడ్డం శంకర్ రెడ్డి, చర్ల పెళ్లి రాజేశ్వర్ గౌడ్ ,వెల్మల శ్రీనివాస్ రావు, ఆల్ రౌండర్ గంగాధర్ లయన్స్ క్లబ్ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags: