కాంగ్రెస్ పార్టీది అభయ హస్తం కాదు - భస్మాసుర హస్తం ;- బిజెపి పార్టీ
On
విశ్వంభర, మునుగోడు నియోజకవర్గం : చండూర్ మండలంలోని నెర్మట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అధికారం కోసం చేయూత పథకము ద్వారా పెన్షన్ ప్రతి నెలకు రూ/- 2000 నుండి రూ/- 4000 ఇస్తామని , మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి గృహిణికి ప్రతి నెల రూ/- 2500/- అందజేస్తామని ప్రజలకు శాసనసభ ఎన్నికల ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ మండల పార్టీ తరుపున ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్న నాయకులు, కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజె వై ఎం రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి ,మండల నాయకులు నారపాక మహేందర్ , నందికొండ శ్రీపాల్ రెడ్డి , దాసరి శంకర్ , బండమీది వెంకన్న , నాగరాజు , గిరి తదితరులు పాల్గొన్నారు.



