రాజ్యాంగ రక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి -పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
విశ్వంభర, దోమ : భారత రాజ్యాంగం విలువలపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పరిగి ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం దోమ మండల పరిధిలోని గుండాల్, కొత్తపల్లి, దాదాపూర్ గ్రామాలలో జై బాపు, జై భీమ్, జై సంవిదాత్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. వాస్తవాలను ప్రజలకు తెలిపేందుకే జై బాపు, జై భీమ్, జై సంవిదన్ అభియాన్ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ చేసిన సేవలు, స్వతంత్రం వచ్చాక భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చిన ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలుపామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పిఎసిఎస్ చైర్మన్ యాదవ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ప్రభాకర్ రెడ్డి,శాంత కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాఘవేందర్ రెడ్డి, మాజీ జిల్లా గ్రంధాల డైరెక్టర్ యాదయ్య గౌడ్, కాంగ్రెస్ నాయకులు అంతిరెడ్డి, రాములు నాయక్, రమేష్ ,చిన్న కిష్టయ్య, సురేష్, తదితరులు పాల్గొన్నారు.



