శ్రీ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో అంబలి కేంద్రం ప్రారంభం

శ్రీ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో అంబలి కేంద్రం ప్రారంభం

విశ్వంభర, మహేశ్వరం : శ్రీ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో మహేశ్వరం మండలంలోని మన్సాన్పల్లి ఎక్స్ రోడ్ లో అంబలి కేంద్రం ప్రారంభించారు. సల్ల శ్రీనివాసరావు తల్లి  సల్ల లలిత చేతుల మీదుగా ఈ యొక్క అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. గత ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నట్టు ప్రతి సంవత్సరం రెండు నెలలు తప్పకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని స్వయంగా రాగులు షాద్నగర్ నుంచి తీసుకొని వచ్చి స్వతహాగా పట్టించి ప్రతిరోజు 400 నుండి500 మందికి ఈ యొక్క అంబలి పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షుడు పాండిచ్చేరి ఇంచార్జ్ పాపన్న గౌడ్,  సహాయ సహకారాలు అందిస్తున్న ముత్యంకి ధన్యవాదాలు తెలిపారు.

Tags: