జ్యోతిరావ్ పూలే జయంతి సందర్బంగా మెగా రక్తదాన శిబిరం 

- మదర్ థెరిసా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో  సేవా కార్యక్రమం

జ్యోతిరావ్ పూలే జయంతి సందర్బంగా మెగా రక్తదాన శిబిరం 

  •  పాల్గొన్న అడిషనల్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ గాదరి మనోహర్ 

విశ్వంభర, వనస్థలిపురం :- మహాత్మా జ్యోతిరావు పూలే 198 వ జయంతి సందర్బంగా మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారం తో మెగా రక్తదాన శిబిరాన్ని సామాజిక కార్యకర్త, చారిటి అధ్యక్షుడు చేపూరి శంకర్ సమక్షంలో వనస్థలిపురంలోని బిఎన్ రెడ్డి నగర్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీ లోని కమ్యూనిటీ హల్ లో  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అడిషనల్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ సిసి ఎస్ హైదరాబాద్ గాదరి మనోహర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ చేపూరి శంకర్ చేస్తున్న ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. చాలా ప్రాంతాలలో ప్రజలకు ఏ విధంగా అయినా సేవా చేస్తూనే ఉంటారు. రక్త దానం తో పాటు అవయవ దానం పై కూడా అవగాహనా కల్పించాలని చేపూరి శంకర్ ను కోరారు. అలాగే చారిటీ నిర్వాహకులు చేపూరి శంకర్ మాట్లాడుతూ నిత్యం ఎంతోమంది సమాజంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్నారని, రోడ్డు ప్రమాదాలలో, గర్భిణీ స్త్రీలు, గుండె ఆపరేషన్ ల కొరకు, తలసేమియా భాదితులు ఇలా రోజుకు చాలామంది ప్రాణాలు పోతున్నాయని అన్నారు. రక్తదానం చేయడం వలన మరొకరికి ప్రాణదానం  చేయడమే అని అన్నారు.  ప్రతిఒక్కరు సమాజం కోసం ఏదో ఒక విధంగా సేవా చేయాలనే దృక్పధం తో ముందుకు సాగాలని అన్నారు. మా చారిటీ ద్వారా వివిధ రకాలు అయినా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ, రక్తదానం, చలివేంద్రాలు, అబాగ్యులకు దుప్పట్ల పంపిణి, నిరుపేదలకు అన్నదానం, కరోనా సమయాల్లో మెడికల్ కిట్లు , ప్లేట్ లేట్ లు ,  ఎన్నో సేవ కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. రక్తదాన శిబిరంలో దాదాపు 100 కు పైగా రక్తదానం  చేశారు.  ఈ కార్యక్రమంలో  చేపూరి సునీత , ముద్దగౌని సతీష్ గౌడ్, స్ఫూర్తి సేవ అధ్యక్షుడు సంజయ్ కుమార్ , సుధాకర్ శర్మ జోషి , వేణు గోపాల్ గౌడ్ , శ్రీధర్ గౌడ్ , కృష్ణ , శ్రీనివాస్ , కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. WhatsApp Image 2025-04-10 at 3.39.43 PM

Tags: