నిరాశ్రయులకు బియ్యం, నగదు పంపిణీ
కుటుంబానికి ప్రభుత్వ ఉపాధ్యాయుల సహాయం
On

విశ్వంభర, మహబూబాబాద్ : మండలంలోని పిక్లా తండా శివారు బోడగుట్ట తండా ఆవాసంలో ఇల్లు కూలి నిరాశ్రయులైన రెండు కుటుంబాలకు అక్కడి పాఠశాల ఉపాధ్యాయులు బియ్యం, నగదు పంపిణీ చేశారు. గాలి దుమారంతో రేకుల ఇండ్లు కూలిపోయి నిరాశ్రయులైన గుగులోతు కల్పన, బానోతు సురేష్ కుటుంబాలకు చేరో 25 కిలోల చొప్పున 50 కిలోల బియ్యం ప్రధాన ఉపాధ్యాయులు డి.వి. రమణ వారి తల్లి ధర్మపురి ప్రమీల జ్ఞాపకార్థం అందించారు. అలాగే నగదు రూపాయలు 516/- లను ఉపాధ్యాయుడు గనె యాదగిరి తాత్కాలిక అవసరాల కోసం అందించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ గుగులోతు నీల గ్రామ కారోబార్ గూగులోతు నరేష్ రావుల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.