ఆటో డ్రైవర్ హత్య

ఆటో డ్రైవర్ హత్య

విశ్వంభర,  హైదరాబాద్ :  పాతబస్తీలో ఓ ఆటో డ్రైవర్ హత్యకు గురైన ఘటన సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్ స్పెక్టర్ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం చంద్రాయణ గుట్ట బండ్లగూడ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అస్లాం (22) ఆటో డ్రైవర్. ఈ నెల 7న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి అస్లాం ఇంటికి తిరిగి రాక రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్నేహితులతో ఆరా తీసిన ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం సంతోష్ నగర్ లోని డిబిషా దర్గా సమీపంలోని స్మశాన వాటికలో అస్లాం రక్తపు మడుగుల్లో పడి ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు .తన కుమారుడు మృతికి పైజల్ అనే వ్యక్తి అనుమానం ఉన్నట్లు తల్లి రెహనా బేగం ఫిర్యాదులో పేర్కొంది.

Tags: