ప్రజల రక్షణే కార్డెన్ సెర్చ్ ఉద్దేశం

ప్రజల రక్షణే కార్డెన్ సెర్చ్ ఉద్దేశం

విశ్వంభర, సిద్దిపేట : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వారికి రక్షణ, భద్రతాభావం కలిగించడమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశమన్నారు.  రూరల్ సీఐ శ్రీనివాస్. సీపీ అనురాధ ఆదేశాల మేరకు నారాయణరావుపేట మండలకేంద్రంలో గురువారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. రక్షణపరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కొత్త చట్టాల గురించి ప్రతొక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 100కు ఫోన్ చేయాలని సూచించారు. సైబర్ నేరాలపై ఎన్‌సీ‌ఆర్పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని, టోల్ ఫ్రీ నెంబర్ 1930కి కాల్ చేయాలన్నారు. కార్డెన్ సెర్చ్‌లో ఎలాంటి పేపర్లు లేని 55 మోటార్ సైకిల్స్, 7లిక్కర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. సెర్చ్‌లో రూరల్ ఎస్ఐ అపూర్వరెడ్డి, మిరుదొడ్డి ఎస్ఐ పరశురామ్, ఎస్ఐలు మల్లేశం, రాజేశం, డాగ్స్ స్క్వాడ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags: