లక్ష్మాపురం, కొత్తగూడెం గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం.
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని లక్ష్మాపురం, కొత్తగూడెం గ్రామాలలో ఐకెపి, పి.ఏ.సి.ఎస్ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం బుధవారం రోజు జరిగింది. ఈ కార్యక్రమంలో పి.ఏ.సి.ఎస్ చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి, రామన్నపేట-వలిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్-చైర్మన్, రామన్నపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, తాజా మాజీ సర్పంచ్లు ఉప్పు ప్రకాష్, చిల్లర కైలాసం, గ్రామ నాయకులు బత్తుల కృష్ణ, కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



