హనుమాన్ శోభాయాత్ర పోస్టర్ ఆవిష్కరణ.

విశ్వంభర, ఎల్బీనగర్ : హనుమాన్ శోభాయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని హనుమాన్ యువసేన అధ్యక్షుడు బోల్గం యశ్పాల్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. కొత్తపేట డివిజన్ మోహన్ నగర్ లో హనుమాన్ యువసేన ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి శోభాయాత్ర పోస్టర్ ను నిర్వాహకులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బోల్గం యశ్పాల్ గౌడ్ మాట్లాడుతూ గత 13 సంవత్సరాల నుండి హనుమాన్ యువసేన ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 12వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు పూజా కార్యక్రమం 6 గంటలకు హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమవుతుందన్నారు. శోభాయాత్ర బాలాజీ నగర్ కాలనీ నుండి మోహన్ నగర్ చౌరస్తా మీదుగా కొత్తపేట గ్రామం హరిజన్ బస్తి, ఓల్డ్ మారుతి నగర్ చౌరస్తా, జైన్ మందర్, హనుమాన్ టెంపుల్, బాబు కాంప్లెక్స్, చైతన్యపురి రామాలయం వరకు కొనసాగుతుందన్నారు. ఈ శోభయత్రలో యువకులు, మహిళలు, యువజన సంఘాలు, సీనియర్ సిటిజన్స్, కాలనీ సంక్షేమ సంఘాలు అధిక సంఖ్యలో విచ్చేసి శోభయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్, వినోద్ కుమార్, వెంకటేష్, సంప్రీత్, విష్ణు, భావన్, వరుణ్ తరుణ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.