అంబులెన్స్ లో మహిళ ప్రసవం.
సిబ్బంది ఈఎంటి బ్రహ్మీ, డ్రైవర్ అజ్రకుమార్ పనితీరుపై హర్షం
On
విశ్వంభర, మిర్యాలగూడ : వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన అలివేలుకి పురిటి నొప్పులతో బాధపడుతున్నారని ఉదయం తెల్లవారుజామున 108 సిబ్బందికి ఫోన్ రావడంతో గర్భిణీ ఇంటికి వెళ్లిన అంబులెన్స్, సిబ్బంది బ్రహ్మీ అంబులెన్స్ లోనే అలివేలు కాన్పు నిర్వహించడం జరిగింది. మగ బిడ్డకు జన్మనివ్వడంతో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని ఈఎంటి బ్రహ్మీ తెలిపారు. త్రిపురారం మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల ప్రజలు 108 వాహన సేవలు వినియోగించుకోవాలని ఈఎంటి బ్రహ్మీ ,డ్రైవర్ అజ్ర కుమారులు తెలిపారు. అంబులెన్స్ సిబ్బంది పనితీరుపై హర్షం వ్యక్తం చేసిన స్థానికులు.



