సముద్ర తరంగాల అస్థిరతలపై అధ్యయనం
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పరిశోధనాంశాలను వెల్లడించిన బ్రిటన్ నిపుణుడు డాక్టర్ అనిర్బన్ గుహ
విశ్వంభర, సంగారెడ్డి జిల్లా : సముద్ర తరంగాల అస్థిరతలపై చేసిన పరిశోధన, అధ్యయనాంశాలను బ్రిటల్ డండీ విశ్వవిద్యాలయంలో పర్యావరణ ద్రవ మెకానిక్స్ లో సీనియర్ అధ్యాపకుడు డాక్టర్ అనిర్బన్ గుహ వెల్లడించారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘సముద్ర తరంగాల అస్థిరతల’పై బుధవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. సముద్ర పొరలలో పదునైన సాంద్రత పొరలు, వాటి సుదూర అనువర్తనాల లోతైన అన్వేషణను సదస్యులతో పంచుకున్నారు.ప్రపంచ సముద్ర నమూనాలను మెరుగుపరచడంలో, వాతావరణ అంచనాలను మెరుగుపరచడంలో, జలాంతర్గామి నావిగేషన్, ఆఫ్ షోర్ నిర్మాణాల కోసం వేవ్ లోడింగ్ విశ్లేషణలో వాటి ఔచిత్యాన్ని ఆయన నొక్కి చెప్పారు. ప్రవాహం ప్రారంభంలో కొన్ని పరిస్థితులలో స్థిరంగా కనిపించినప్పటికీ, అది ఘాతాంక పెరుగుదల ద్వారా అస్థిరతలోకి మారగలదని డాక్టర్ గుహ పేర్కొన్నారు. తొలుత, ప్రొఫెసర్ బీ.ఎం.నాయుడు అతిథిని స్వాగతించి, సదస్యులకు పరిచయం చేశారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, ఇతర అధ్యాపకులతో కలిసి డాక్టర్ గుహను దుశ్శాలువ, జ్జాపికలను ఇచ్చి సత్కరించారు. కాగా, ఈ అతిథ్య ఉపన్యాస కార్యక్రమాన్ని డాక్టర్ లిమా బిశ్వాస్, డాక్టర్ వి.కామేశ్వర శ్రీధర్ సమన్వయం చేశారు. ఈ ఉపన్యాసం అధ్యాపకులను ద్రవ డైనమిక్స్, పర్యావరణ శాస్త్రంలో అత్యాధునిక పరిశోధనలకు పురిగొలిపింది.



