గాయని మాళవిక ఆనంద్ కు అమెరికా ఆహ్వానం
విశ్వంభర, హైదరాబాదు: శాస్త్రీయ భక్తి గాయకు రాలు ఆల్ ఇండియా రేడియో గ్రేడెడ్ కళాకారిని హైదరాబాద్ కు చెందిన మాళవిక ఆనంద్ కు ఆహ్వానం అందింది. తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ, న్యూజెర్సీ, అమెరికా ఏప్రిల్ 12న అమెరికాలోని న్యూజెర్సీలో ఉగాది వేడుకలు జరగనున్నాయి. మాళవిక 650 కి పైగా సంగీత కచేరీలు చేసింది. ఆమె 8 విభిన్న భాషలలో పాడగలదు. ఈమె ప్రపంచ ప్రసిద్ధి చెందిన మైసూర్ ప్యాలెస్ లో ప్రదర్శనలు ఇచ్చింది. దసరా పండుగతో పాటు తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా ప్రదర్శన తో ఆకట్టుకుంది. హైదరాబాద్ లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో మాళవిక చేసిన ప్రదర్శన చిరస్మరణీయం. మాళవికను అమెరికాకు ఆహ్వానించడం ఇది రెండోసారి కాగా, అట్లాంటాలో ప్రదర్శన ఇవ్వాల్సిందిగా ఆప్టా తెలుగు అసోసియేషన్ ఆమెను ఆహ్వానించింది. తిరుమలలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నాద నీరాజనం వేదికపై కూడా మాళవిక ప్రదర్శన ఇచ్చింది. మాళవిక ప్రస్తుతం హైదరాబాద్ సిస్టర్స్ హరిప్రియ వద్ద క్లాసికల్ మ్యూజిక్ శిక్షణ లో ఉంది.



