జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదంతో కాంగ్రెస్ నాయకులు గడపగడప ప్రచారం
On

విశ్వంభర, మహేశ్వరం : కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు కందుకూరు మండలం ధన్నారం చిప్పలపల్లి, మురళీనగర్, ధావుద్ గూడ తాండ, పెద్దమ్మతాండ గ్రామాలలో నిర్వహించిన జై బాపు, జై భీమ్ జై సంవిధాన్ గడప గడప కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ సభవత్ కృష్ణా నాయక్ మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ ఏనుగు జంగారెడ్డి మాట్లాడుతూ. జై భీమ్ జై బాపు జై సంవిధాన్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుందని అన్నారు.ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న మోడీ ప్రభుత్వం విధానాలను వివరించారు, అలాగే
రాహుల్ గాంధీ భారత్ జోడయాత్ర ద్వారా దేశ ప్రజలను ప్రేమ,సమానత్వం గురించి చైతన్యవంతం చేశారని అన్నారు.