మిర్చి రైతులను దోసుకుంటున్న దళారీలు

విశ్వంభర, మహబూబ్ బాద్ : జిల్లా కేంద్రానికి వస్తే సిండికేట్ అయిన వ్యాపారులు మిర్చి రైతులను దోచుకుంటున్నారని సిపిఐ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి పాయం చిన్న చంద్రన్న ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నేడు మహబూబాబాద్ జిల్లా పార్టీ కార్యాలయం లో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి పంటలు తీస్తే మార్కెట్లో దళారీలు వ్యాపారులు ధర తగ్గించడంతోపాటు, చిల్లర కొనుగోళ్ల వద్ద తూకం లో మోసాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. మార్కెట్ నిండిపోయిందని మిర్చి తేవద్దని మార్కెట్ శాఖ చెప్తుంటే కోల్డ్ స్టోరేజీలు చిల్లర కంట దారులు కొనుగోలు చేస్తూ మార్కెట్ శాఖ కొనుగోలలో లెక్కలు చూపించటం జరుగుతుందని అన్నారు. మహబూబాబాద్, కేసముద్రం వ్యవసాయ మార్కెట్ శాఖ కమిటీలు మార్కెట్కు పంట తెచ్చిన రైతులు వారి సమస్యలను గాలికొదురుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజా ప్రతినిధులు వ్యాపార వర్గం చేసుకుంటున్న చీకటి ఒప్పందాల వల్ల మిర్చి రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని ఆయన అన్నారు. కోల్డ్ స్టోరేజ్ లో జరుగుతున్న కొనుగోళ్ల అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి, జిల్లా నాయకులు ముంజంపల్లి వీరన్న, బిళ్ళ కంటి సూర్యం, కేసముద్రం సంయుక్త మండలాల కార్యదర్శి పైండ్ల యాకయ్య, టియుసిఐ జిల్లా నాయకులు పాడిన బీకు, తదితరులు పాల్గొన్నారు