టీజీఐఐసి చైర్మన్ గాబాధ్యతలు స్వీకరించిన నిర్మలా జగ్గారెడ్డి
On
తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కార్పోరేషన్ (టీజీఐఐసి) చైర్మన్ గా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి సతీ మణి తూర్పు నిర్మల జగ్గారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. బషీర్ బాగ్ చౌర స్త్రీలోని పరిశ్రమల భవన్లో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు ,ఉత్తమ్ కుమార్ రెడ్డి,పొన్నం ప్రభాకర్, , టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ , మధుయాష్కీ గౌడ్ తదితరులు హాజరై ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ నాయకులూ కార్యకర్తలు జగ్గారెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు