అర్హులకు రైతు రుణ మాఫీ
విశ్వంభర భూపాలపల్లి జూలై 23 : - సాంకేతిక కారణాలతో రైతు రుణమాఫీ జరగని రైతుల సమస్యను పరిష్కరించి అర్హులకు రుణమాఫీ చేసేందుకు వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో రైతు రుణ మాఫీపై జిల్లా వ్యవసాయ అధికారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో 16,502 మంది రైతులకు లక్ష లోపు రుణమాఫీ జరుగనుందని తెలిపారు. ఇందులో సహకార బ్యాంక్ లలో 2853 మంది రైతులకు 13.61 కోట్లు, వాణిజ్య బ్యాంకులలో 13649 మందికి 80.5 కోట్లు రుణం మాఫీ జరిగిందని, ఇందులో ఎవరికైనా రుణమాఫీ జరగకపోతే మండల లేదా జిల్లా వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో మిగిలిన రైతులకు రుణమాఫీలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యను పరిష్కరించి త్వరలోనే రుణమాఫీ చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన విధంగా అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ జరుగుతుందని అపోహ చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
రైతుల సందేహాలను నివృత్తి చేసుకునేందుకు
శ్రీ బాపు సహాయ వ్యవసాయ సంచాలకులు (టెక్నికల్) గారి 7288894710 కు గానీ, జిల్లా వ్యవసాయాధికారి శ్రీ M. విజయ భాస్కర్ గారి 7288894787 కు గానీ సంప్రదించ గలరు.
ఈ సమావేశం లో
జిల్లా వ్యవసాయ అధికారి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నా