అత్యవసర సేవల భద్రతకు వోల్టా, టెన్ సంయుక్త భాగస్వామ్యం

WhatsApp Image 2024-07-25 at 17.26.24_6bc69503

విశ్వంభర-బషీర్ బాగ్ : - హైదరాబాద్ ఆధారిత రైడ్-హెయిలింగ్ యాప్ వోల్టా, టోటల్ ఎమర్జెన్సీ నెట్‌వర్క్ (టెన్)తో సంయుక్త భాగస్వామ్యాన్ని ప్రకటించింది. అత్యవసర సేవలు అందించడంలో వినూత్న ప్రణాళికలతో వోల్టా వినియోగదారులకు మరింత భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భాగస్వామ్యం కుదుర్చుకున్నామని వోల్టా వ్యవస్థాపకుడు శశికాంత్ కనపర్తి తెలిపారు.డ్రైవర్లకు ఎలాంటి కమీషన్ లేకుండా (జిరో కమీషన్) రైడ్‌లను అందించడంతో పాటు వినియోగదారులకు అంతరాయాలు లేని, వోల్టాస్టిక్ అనుభవాలను అందించడంలో వోల్టా తన నిబద్ధతకు ప్రదర్శిస్తుందన్నారు. ఈ యాప్ లో ప్రస్తుతం అధునాతనమైన సాంకేతికతతో  ఏస్ ఓ ఏస్ బటన్‌ను చేర్చారనీ అన్నారు. ఇది అత్యవసర పరిస్థితుల్లో వినియోగదారులను టోటల్ ఎమర్జెన్సీ నెట్‌వర్క్ టెన్  వేగవంతమైన అంబులెన్స్ సేవలకు తక్షణమే కనెక్ట్ చేయడానికి రూపొందించమని వెల్లడించారు. కేవలం ఒక క్లిక్ తో ఈ ఫీచర్ సహాయం ఎప్పుడైనా, ఎక్కడైనా తక్షణ సేవలను అందిస్తుందన్నారు.
ఈ సందర్భంగా టెన్ సర్వీసెస్ ఏండి వెంకట కిషోర్ బాబు మానేపల్లి మాట్లాడుతూ వేగవంతమైన, నమ్మదగిన అత్యవసర సహాయాన్ని అందించడమే తమ ప్రధాన లక్ష్యం అన్నారు. 650 అంబులెన్స్‌ల అత్యవసర సేవలతో 4,500 మందికి పైగా ప్రాణాలను కాపాడిన ట్రాక్ రికార్డ్‌ తమ సొంతం అన్నారు. పరిధిని విస్తరించడంతో పాటు మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నామనీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రతిస్పందించి కేవలం 7 నిమిషాల్లో అంబులెన్స్ ను స్పాట్ కు వచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నాం అని అన్నారు. మనుగడ రేటును పెంచడానికి దీనిని వైద్య పరిభాషలో 'గోల్డెన్ అవర్' అని పిలుస్తారని ఆయన తెలిపారు. సహకారం ప్రజల భద్రతను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుందన్నారు.వినియోగదారు శ్రేయస్సుకు ప్రాధాన్యతనిచ్చే అధునాతన ఫీచర్‌లను సమగ్రపరచడంలో వోల్టా తన అంకితభావాన్ని ప్రదర్శిస్తుందన్నారు. వోల్టా ఆధ్వర్యంలోని వినూత్న రైడ్-హెయిలింగ్ సొల్యూషన్‌లను టెన్ సంస్ధ నిపుణుల అత్యవసర ప్రతిస్పందన సామర్థ్యాలతో కలపడం ద్వారా ఈ భాగస్వామ్యం అత్యవసర ప్రతిస్పందన, రైడ్-హెయిలింగ్ సేవల్లో కొత్త ప్రమాణాన్ని సెట్ చేస్తుందని  వోల్టా వ్యవస్థాపకుడు శశికాంత్ కనపర్తి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Read More తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం కేటాయించాలి - డాక్టర్ పిడమర్తి రవి