'సమూహ' రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి
~ సమూహ కరపత్రాల ఆవిష్కరణ
~ కార్యక్రమ విజయవంతానికి కవి సమ్మేళనాలు నిర్వహించాలని పిలుపు
~ రాజ్యాంగ విలువలను కాపాడే అన్ని సంస్థలు పాల్గొనాలని విజ్ఞప్తి
విశ్వంభర, మహబూబ్ నగర్: 'సమూహ' సెక్యులర్ రైటర్స్ ఫోరం రాష్ట్ర మహాసభలు డిసెంబరు 14 న మహబూబ్ నగర్ పట్టణంలో జరగనున్నాయి. కాబట్టి ఈ సభలను విజయవంతం చేయాలని కోరుతూ 'సమూహ' కరపత్రాలను రాష్ట్ర బాధ్యులు కాత్యాయని విద్మహే,
మెట్టు రవీందర్, సుంకిరెడ్డి నారాయణరెడ్డి ఆవిష్కరణ చేశారు .
భారత రాజ్యాంగం
ఆదర్శవంతమైన లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్య స్థాపనకై అన్ని మతాలు కలిసి సహోదరత్వంతో కలిసి సుఖంగా జీవించడానికి అనువైన వాతావరణం భారత రాజ్యాంగం కల్పించింది. ప్రజలు భిన్న మతావిశ్వాసాల పట్ల పరస్పర గౌరవంతో సామరస్యంగా,సోదర భావంతో జీవించాలనే లౌకిక ప్రజాస్వామిక విలువలు రాజ్యాంగంలో పొందుపరిచారు.
ఎవరి మత విశ్వాసాలను వారు అనుసరిస్తూనే మిగతా మతాలను గౌరవించేటటువంటి ఒక స్నేహపూర్వకమైన ప్రజాస్వామ్య విలువలను మనందరం కూడా కాపాడుకోవాలి. లౌకిక సామ్యవాద భావనలను భారత రాజ్యాంగంలో నుండి తీసివేయాలనేటటువంటి కుట్రలను మనందరం కూడా ఖండించాలని వక్తలు పిలుపు నిచ్చారు.ఈ సభలు విజయవంతం కావడానికి ఉమ్మడి మహబూబ్ నగర్ అన్ని జిల్లా కేంద్రాలలో ఈ కరపత్రాలను ఆవిష్కరించి,కవి సమ్మేళనాలను నిర్వహించి ఈ సభల యొక్క ఉద్దేశాన్ని విరివిగా ప్రచారం చేయాలని కోరడం జరిగింది. సమూహ ఆశయాలను లక్ష్యాలను భారత రాజ్యాంగ పరిధిలో అందరికీ తెలియజేయాలని వక్తలు కోరారు.ఈ కార్యక్రమంలో సమూహ కార్యవర్గ సభ్యులు ఉదయమిత్ర, గుడిపల్లి నిరంజన్, అదే విధంగా ఆహ్వాన కమిటీ సభ్యులు రాఘవాచారి,ఎస్ జగపతిరావు, కె లక్ష్మణ్ గౌడ్, ఖలీల్, వామన్ కుమార్,ఉదయ్,సుభాష్ సతీష్,సృజన, ఖలీల్,అజీజ్, శ్రీశైలం,రెహమాన్, జనార్ధన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.