నర్సింగ్ విద్యార్థులకు ఎయిడ్స్ పై అవగాహన
నర్సింగ్ విద్యార్థులకు ఎయిడ్స్ పై అవగాహన
విశ్వంభర, భూపాలపల్లి:భూపాలపల్లి జిల్లా కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సింగ్ విద్యార్థులకు హెచ్ ఐ వీ ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమము నిర్వహించారు. కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎంఎల్ హెచ్ పీ డాక్టర్ వందన ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహాదేవపూర్ సమీకృత సలహా పరీక్ష కేంద్రం కౌన్సిలర్ రమేష్ అవగాహన కల్పించారు. హెచ్ఐవీ వ్యాధి వ్యాప్తి నివారణ చర్యలు తీసుకోవాలని జాగ్రత్తల గురించి వారికి వివరించారు. సమాజంలో హెచ్ఐవీ వ్యాధి చాప కింద వ్యాపిస్తున్న నేపథ్యంలో యువత విద్యార్థులు మేల్కొని సమాజాన్ని జాగ్రత్త చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్, వివేకానంద ఒకేషనల్ విద్యార్థులు పాల్గొన్నారు.