పోలీస్ శాఖలో ఫిజికల్ ఫిట్నెస్ చాలా కీలకం:జిల్లా ఎస్.పి రూపేష్

పోలీస్ శాఖలో ఫిజికల్ ఫిట్నెస్ చాలా కీలకం:జిల్లా ఎస్.పి రూపేష్

* ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్

•    నూతనంగా నియమించబడిన ఎ.ఆర్, సివిల్ కానిస్టేబుల్స్ కు వీక్లీ పెరేడ్

* వివిధ సెక్షన్, వర్టికల్స్ విభాగాలపై అవగాహన కార్యక్రమం 

•    సత్ ప్రవర్తకన కలిగి, ప్రజలలో పోలీసు ఇమేజ్ పెంచే విధంగా విధులు నిర్వహించాలి

విశ్వంభర, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్స్ నందు నూతనంగా నియమించబడిన ఎ.ఆర్ మరియు సివిల్ కానిస్టేబుల్స్ కు ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పరేడ్ ను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్ పి రూపేష్ తెలియజేశారు. ఫిట్నెస్ ను కాపాడుకోవాలని, శారీరకంగా, మానసికంగా ఫిట్ గా ఉన్నప్పుడే ఎలాంటి పరిస్థితులలోనైనా తమ విధులను సమర్ధవంతంగా నిర్వర్తించగలం అని అన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలని, ఆపదలో స్టేషన్ కు వచ్చిన వారికి మీ మాటతీరు వారిలో ఒక భరోసాను కల్పించాలని అన్నారు. మీ యొక్క ప్రవర్తన ప్రజలలో పోలీస్ యొక్క ఇమేజ్ పెంచే విధంగా ఉండాలన్నారు. వీక్లీ ప్రాతిపాదికన నిర్వహిస్తున్న ట్రైనింగ్ కార్యక్రమంలో  పోలీస్ శాఖ పని తీరు, వివిధ సెక్షన్స్, వర్టికల్స్ మరియు నూతన చట్టాల గురించి వివరించడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు అన్ని విభాగాల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండి ఎలాంటి విధులనైనా సమర్థవంతంగా నిర్వహించేందుకు  సిద్ధంగా ఉండాలని జిల్లా ఎస్ పీ సూచించారు.పోలీస్ స్టేషన్ నందు సీనియర్స్ తో మరియు అధికారులతో మర్యాదగా నడుచుకోవాలని, అధికారులు  చెప్పిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని అన్నారు.  సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా తమకు కేటాయించిన పోలీస్ స్టేషన్ హెడ్ క్వార్టర్స్ నందు నివాసం ఉండాలని 24*7 అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలందించాలని సూచించారు.  ఇతర దూర ప్రాంతాల నుండి ప్రయాణాలు ప్రమాదలకు దారితీసే అవకాశం ఉందని పోలీస్ స్టేషన్ హెడ్ క్వార్టర్స్ నందు నివాసం ఉండాలని సూచించారు. చెడు అలవాట్లకు, బానిసలు కాకూడదని, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి, ఇటు పోలీస్ శాఖకు, అటు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నానని, అదేవిధంగా జిల్లా పోలీస్ శాఖలో చేరుతున్న సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో అదనపు ఎస్.పీ ఎ.సంజీవ రావ్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఇ.కళ్యాణి, పటాన్ చేరు డీ.యస్.పీ రవీందర్ రెడ్డి, యస్.బి సీఐ విజయ్ కృష్ణ, ఆర్.ఐ.లు రామ రావ్, రాజశేఖర్ రెడ్డి, డానియెల్, శ్రీనివాస్ మరియు జిల్లా ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్ ప్లటూన్ ఇంచార్జ్ లు సిబ్బంది తదితరులు ఉన్నారు.

Tags: