మైనారిటీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల సందర్శించిన టీపీసీసీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు
మైనారిటీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల సందర్శించిన టీపీసీసీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు
విశ్వంభర, మెట్ పల్లి: జగిత్యాల జిల్లా మెట్ పల్లి మైనారిటీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ను ఆకష్మిక తనిఖీ చేసిన టీపీసీసీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు వారితో పాటు ఆర్డీఓ శ్రీనివాస్ ఎంఈఓ చంద్రశేఖర్ ,పాఠశాలలోని భోజనశాల, భోజనానికి సంబంధించిన డ్రింకింగ్ వాటర్, పడక గదులను పరిశీలించిన అనంతరం స్కూల్ పిల్లలతో కలిసి భోజనం చేశారు. అలాగే వారు స్కూల్ ప్రిన్సిపాల్ తిరుపతి తో మాట్లాడి దీనిని ఇలానే కంటిన్యూ చేయాలని ఏమైనా అసౌకర్యాలు, ఇబ్బందులు ఉన్నచో ఆర్డీవో కి, ఎంఈఓ కి అలాగే మా దృష్టికి తీసుకువస్త్ పరిష్కరిస్తామని చెప్పడం జరిగినది . ఈ కార్యక్రమంలో పట్టణ మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జెట్టి లింగం,అల్లూరి మహేందర్ రెడ్డి,కౌన్సిలర్లు యమా రాజయ్య, ఎర్రోళ్ల హన్మాంళ్లు మాజీ సర్పంచ్ లు పుదారి నర్సాగౌడ్,కోమిరెడ్డి లింగారెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ జీవన్,కోరుట్ల పట్టణ,మండల,బ్లాక్ అధ్యక్షులు గంగాధర్,కోమతం రాజం,సత్యనారాయణ గౌడ్,ముకేమ్,ఉప సర్పంచ్ ఆగ బాలయ్య టి రాంప్రసాద్ కాంగ్రెస్ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్ననారు.