వరంగల్ క్లబ్ లో  ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభించిన:ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ

వరంగల్ క్లబ్ లో  ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభించిన:ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ

వరంగల్ క్లబ్ లో  ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నమెంట్

విశ్వంభర, హనుమకొండ: హనుమకొండ సుబేదారి లోని వరంగల్ క్లబ్ నందు సీనియర్ టెన్నిస్ క్రీడాకారుడు కి.శే..శ్రీనివాస్ గౌడ్  జ్ఞాపకార్థం 2లక్షల 50వేల రూపాయల బహుమతితో  వరంగల్ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ నేషనల్ లెవెల్ మెన్స్ ఓపెన్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే  నాగరాజు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా దేశాల నుండి వచ్చిన క్రీడాకారులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. అదేవిధంగా వరంగల్ క్లబ్ టెన్నిస్ ఆర్గనైజేషన్ వారితో  కలసి టెన్నిస్ ఓపెన్ టోర్నమెంట్ కు టాస్ వేసి ప్రారంభించడం జరిగింది.
అలాగే ఆల్ ఇండియా నుంచి విచ్చేసిన మెంటర్స్ క్రీడాకారులు ఉమ్మడి వరంగల్ జిల్లా విశిష్టతను కాకతీయుల నాటి కళ ఖండాలను వీక్షించి కాకతీయ చరిత్రను ఇక్కడ ఉన్న ప్రాచీనమైన దేవాలయాలను దర్శించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ క్లబ్ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు ఎల్లా మురుగు, రాజేశ్వరరావు, సెక్రెటరీ మోహన్ రెడ్డి, క్యాషియర్ ప్రవీణ్, జాయింట్ సెక్రెటరీ కన్నారెడ్డి ఈసీ మెంబర్లు,  క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Tags: