అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

టెలిఫోన్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కళ్యాణం

విశ్వంభర, బోడుప్పల్: మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ టెలిఫోన్ కాలనీలో శ్రీ కోదండ రాముని కళ్యాణం ఆనందోత్సాహాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ మేయర్ సామల బుచ్చిరెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారి కల్యాణంలో పాల్గొనీ సీతారాములకు పట్టు వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ సీతారాములకు పట్టు వస్త్రాలతో,ముత్యాల తలంబ్రాలతో,జీలకర్ర బెల్లం సమర్పించి కళ్యాణం నిర్వహించడం, ఈ కళ్యాణాన్ని టెలిఫోన్ కాలనీ వాసులందరూ తిలకించి అనంతరం స్వామి అమ్మవార్లకు వడిబియ్యం పోశారు. ప్రతి ఏటా జరుపుకునే శ్రీ సీతారామ కళ్యాణం ఈసారి కూడా  కాలనీవాసుల అందరీ మధ్య సుఖసంతోషాలతో జరగడం ఆనందదాయకమని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. శ్రీ సీతారామచంద్రుల ఆశీస్సులతో ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కొనసాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో టెలిఫోన్ కాలనీ ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, కోశాధికారి కే బి నరసింహ, కమిటీ మెంబర్స్, కాలనీ పెద్దలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Tags: