సన్న బియ్యం లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనాలు చేసిన ఎమ్మెల్యే ,సబ్ కలెక్టర్ , డి.ఎస్.పి
On

విశ్వంభర, మిర్యాలగూడ; పట్టణంలోని సుందర్ నగర్ కి చెందిన సన్నబియ్యం లబ్ధి దారులు ఆటో నాగయ్య ఇంట్లో, శాంతి నగర్ కి చెందిన శ్రీలత ఇంట్లో సన్నబియ్యంతో ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనంలో బత్తుల లక్ష్మారెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ , డీఎస్పీ రాజశేఖర్ రాజు , ఎమ్మార్వో హరి బాబు, పట్టణ కాంగ్రెస్ నాయకులు నూకల వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.. ఈ సందర్భంగా లబ్ధి దారులు మాట్లాడుతూ... మా ఇంట్లో నాలుగు కుటుంబ సభ్యులకు 24 కిలోలు సన్నబియ్యం అందజేయడం జరిగింది.. గతంలో దొడ్డు బియ్యం తినలేక బయట సన్నబియ్యం కొనుగోలు చేసి బియ్యంలో కలుపుకొని తినే వారం కానీ ఇప్పుడు నెలకు 1500 రూపాయాలు మాకు మిగులుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలియజేశారు.