మహిళ ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ ధ్యేయం

మహిళ ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ ధ్యేయం

విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పథకం దేశానికె ఆదర్శం అన్నారు, శుక్రవారం మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండలం గుంజేడు గ్రామంలో రేషన్ కార్డుదారుడు సిరబోయిన క్రాంతి కుమార్,  వారి కుటుంబ సభ్యులు పద్మ, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అటవీ శాఖ అధికారి విశాల్, తదితర అధికారులతో కలిసి సీతక్క  సన్న బియ్యం భోజనం చేశారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజలకు మహిళలకు అన్ని వర్గాల ప్రజలకు చేదోడు, వాదోడుగా ఉంటుందని అన్నారు, ప్రతి పేదవాడి ఆకలి తీర్చేందుకు ఈ సన్న బియ్యం పథకం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు, మహిళ ఆర్థిక అభివృద్ధి కోసం ఉచిత బస్సు ప్రయాణం, 500 కె గ్యాస్ పంపిణీ పథకం, వడ్డీ లేని రుణల ద్వారా మహిళలు వివిధ నూతన వ్యాపారాలను ప్రారంభించి ఆర్థికంగా ఎదగాలని సూచించారు, ఇప్పపువ్వు ద్వారా ఉత్పత్తి అయ్యే పదార్థాల ద్వారా మహిళలకు ప్రతి ఒక్కరికి ఎంతో ఆరోగ్యకరమైన పదార్థాలు తయారు చేయాలని సూచించారు, సోలార్ విద్యుత్ సరఫరా ప్లాంట్, వ్యవసాయ ఆధారిత వ్యాపారులతోపాటు వాణిజ్య వ్యాపారాలను ప్రారంభించాలన్నారు,

Tags:  

Advertisement

LatestNews

విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం - ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
చండూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం - డా. కోడి శ్రీనివాసులు సహకారంతో పేద ప్రజలకు వైద్య సేవలు 
ఘనంగా చండూర్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ - -ఆవిష్కరించిన  మున్సిపల్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ 
మంత్రిని కలిసిన పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ , వైస్ చైర్మన్  - పోచంపల్లి బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం 
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 
AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు