భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణం విజయవంతం
– కార్యనిర్వాహణ అధికారి ఎల్. రమాదేవికి కోటి వందనాలు

విశ్వంభర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :- భద్రాద్రి కొండలపై భక్తిశ్రద్ధలతో జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవం ఈ ఏడాది అంగరంగ వైభవంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా విజయవంతంగా పూర్తయింది. ఈ పుణ్యకార్యాన్ని నిండు హృదయంతో, సమగ్ర సమన్వయంతో నిర్వహించిన భద్రాచలం దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ఎల్. రమాదేవి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకకు విచ్చేసిన భక్తులకు, వివిధ రంగాల విఐపీలకు, గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రిమండలి సభ్యులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎంతో నిపుణతతో, తనదైన ప్రత్యేక శైలిలో ఈ మహోత్సవాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. భద్రాచల ఉత్సవాల చరిత్రలో ఒక గొప్ప గుర్తింపుగా నిలిచే విధంగా ఆమె నిర్వహణ ప్రశంసనీయం. భక్తులకు అన్నదానం, తాగునీరు ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు వంటి ఏర్పాట్లు ప్రతి మూలన సరఫరా అయ్యేలా చేశారు. ఎటువంటి గందరగోళం లేకుండా, ప్రతి భక్తుడికి సేవలుపాలుగే విధంగా ఏర్పాట్లు చేశారన్నది విశేషం. భద్రాచలం కల్యాణం సందడి మరింత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరగడానికి కారణమైన ఎల్. రమాదేవి గారికి పునఃశ్చరణంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆమెకు భక్తుల తరఫున హృదయపూర్వక నమస్సులు.