మిర్యాలగూడలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

విశ్వంభర, మిర్యాలగూడ; మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం రోజున మహాత్మా జ్యోతి రావు పూలే 198వ జయంతి సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి , ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ కాంగ్రెస్ నాయకులతో కలసి పట్టణంలోని జ్యోతి రావు పులే గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ...సుప్రసిద్ధ భారతీయ సామాజిక కార్యకర్త, ఆలోచనాపరుడు, కుల వ్యతిరేక సంఘ సంస్కర్త మరియు రచయిత. ఫూలే అంటరానితనం నిర్మూలన కోసం పనిచేశాడు.మహిళలు మరియు అణగారిన కులాల ప్రజలలో విద్యావ్యాప్తికి తన కృషిని కొనసాగించాడు.
ఫూలే తన భార్య సావిత్రిభాయి ఫూలేతో కలిసి 1848లో పూణెలో బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించాడు. పులే అనుచరులు, అట్టడుగు కులాల ప్రజలకు సమాన హక్కులను సాధించడానికి సత్యశోధక్ సమాజ్‌ను స్థాపించారు. భారతదేశంలో సాంఘిక సంస్కరణ ఉద్యమంలో ఫూలే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు అని అన్నారు.