మహాత్మ జ్యోతిపూలేకు ఘన నివాళులు
On

విశ్వంభర, అనంతపురం - బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతి బాపూలే 199వ జయంతి సందర్భంగా రాష్ట్ర ఆర్ధిక, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ మడకశిర శాసనసభ్యులుటీటీడీ పాలకమండలి సభ్యులు ఎమ్మెస్ రాజు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ ఘన నివాళుకు అర్పించారు. అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నేతలు కలెక్టర్ నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలుబీసీ నాయకులువివిధ కుల సంఘాల నాయకులు కార్యకర్తలుతదితరులు పాల్గొన్నారు.