మొరాయించిన మీసేవ సర్వర్లు
On
విశ్వంభర , త్రిపురార : త్రిపురారం మండల కేంద్రంలోని మీ సేవ సర్వర్లు మొరాయిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస్ దరఖాస్తు దారులకు, సంబంధిత ధ్రువీకరణ పత్రాల సేవలకు తీవ్ర అంతరాయం కలగడంతో దరఖాస్తుదారులు మీసేవ , తహశీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.రేపటి నుండి ప్రభుత్వ కార్యాలయలకు వరుస సెలవులు ఉండటంతో దరఖాస్తు సమయం దగ్గర పడుతుందని ఆందోళన చెందుతున్నారు.