జార్జ్ రెడ్డి 53 వ వర్ధంతి సభలను విజయవంతం చేయండి

జార్జ్ రెడ్డి 53 వ వర్ధంతి సభలను విజయవంతం చేయండి

విశ్వంభర, హైదరాబాదు: ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఓయూ కార్యవర్గం ఆధ్వర్యంలో ఆసిఫ్  అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోయే జార్జిరెడ్డి 53వ వర్ధంతి సభలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కోటి మహిళా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మాజీ  నాయకులు ఉపేందర్ అన్నా,నిజాం కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ మాజీ నాయకులు డాక్టర్ రంజిత్ అన్నారు.నగర అధ్యక్షులు మంద నవీన్ (ఉస్మానియా యూనివర్సిటీ) ముఖ్యులుగా హాజరై పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే జార్జిరెడ్డి,జార్జి రెడ్డి పేరు లేకుండా ఉస్మానియా యూనివర్సిటీని ఊహించుకోలేమంటే జార్జ్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీనీ ఎంతగా ప్రభావితం చేశాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.1970 వ దశకంలో జార్జి రెడ్డి ఉస్మానియా లో అడుగుపెట్టిన తదానంతరం ఉస్మానియాలో ఉన్న అసమానతలు,దోపిడీ,పీడనలను ప్రత్యక్షంగా చూసి చలించిపోయి వీటన్నిటిని పారదోలీ,కులమతాలు లేని ఒక నవసమాజ స్థాపనే ధ్యేయంగా,శాస్త్రీయ విద్యాసాధనే లక్ష్యంగా   విద్యార్థి సంఘాన్ని స్థాపించి మతోన్మాదుల గుండెల్లో రైలు పరిగెత్తించిన విప్లవ పోరాట యోధుడు కామ్రేడ్ జార్జిరెడ్డి అని కొనియాడారు.

Tags: