మహాత్మ జ్యోతిరావు పూలే సేవలు ఆదర్శనీయం ఎమ్మెల్యే -మందుల సామేల్
On

విశ్వంభర, నాగారం : సంఘ సంస్కర్త కుల వ్యవస్థ నిర్మూలనకు పాటుపడిన మహాత్మ జ్యోతిరావు పూలే సేవలు యువతకు ఆదర్శ నీయమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పేర్కొన్నారు.పూలే జయంతి సందర్భంగా నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ అంటరానితనం నిర్మూలన,కుల వివక్షత మహిళ విద్యకు కృషి చేసిన జ్యోతిబాపూలే మహానీయుడని అన్నారు.వారి త్యాగాల ఫలితంగానే సమాజంలో మార్పులు వచ్చాయని మహాత్మ జ్యోతిబాపూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకుతీసుకువెళ్లాలని అన్నారు.