మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు చిరస్మరణీయం

సమ సమాజ నిర్మాణవేత్త,గొప్ప సాంఘిక సంస్కర్త : రాపోలు రాముడు

మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు చిరస్మరణీయం

విశ్వంభర, మేడిపల్లి: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల  కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు హాజరై మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫూలే దంపతులను గుర్తు చేశారు. వారు సమ సమాజం కోసం చేసిన సాంఘిక సంక్షేమ, సంస్కృతిక కార్యక్రమాలను ఏనాటికి మరువబోమన్నారు. ఈ ఏప్రిల్ మాసంలోనే ఎంతోమంది మహనీయులు జన్మించారని తెలిపారు. 11 ఏప్రిల్ 1827న జన్మించిన జ్యోతి రావు పూలే తాను మరణించినా కానీ నేటికీ అందరిచే పూజింపబడుతున్నాడని కొనియాడారు. పూలే దంపతులు మహిళ  విద్య ఉన్నతికే కృషిచేసిన పుణ్య దంపతులన్నారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి బడుగు బలహీన వర్గాలకు బాట చూపిన మహానీయులు అన్నారు. ఈ కార్యక్రమంలో సందీప్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ రాపోలు సువర్ణ, ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షులు అబ్రహం లింకన్, ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి, ఫెడరేషన్ అడ్వైజర్స్, మెంబర్స్, మహిళా నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews

విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం - ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
చండూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం - డా. కోడి శ్రీనివాసులు సహకారంతో పేద ప్రజలకు వైద్య సేవలు 
ఘనంగా చండూర్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ - -ఆవిష్కరించిన  మున్సిపల్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ 
మంత్రిని కలిసిన పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ , వైస్ చైర్మన్  - పోచంపల్లి బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం 
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 
AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు