డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా

WhatsApp Image 2024-07-24 at 17.21.21_e7f1750dవిశ్వంభర చింతపల్లి జులై 24 : - మహాత్మా గాంధీ యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ ఫలితాల్లో తమ కళాశాలకు చెందిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని చింతపల్లి మండలం లోని మాల్ పట్టణ కేంద్రంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అంబటి జైపాల్ రెడ్డి అన్నారు. డిగ్రీ ప్రధమ, ద్వితీయ, తృతీయ ఫలితాల్లో గుర్రం.దివ్య బీజెడ్సీ 9.76 టాపర్, నూకల.ప్రేమలత బీకాం కంప్యూటర్ 9.56 టాపర్, దోరపల్లి.అఖిల  9.52 బీఎస్సీ ఎంపీసీఎస్ టాపర్, బొడ.పుష్పలత 9.28 బీఏ టాపర్లుగా నిలిచారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రధమ, ద్వితీయ, తృతీయ ఫలితాలలో విద్యార్థులు ప్రభంజనం సృష్టించిన విద్యార్థులకు కాలేజీ యజమాన్యం, కళాశాల సిబ్బంది నరసింహ, మహేష్  విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.