తడి బట్టలతో ప్రమాణం చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

తడి బట్టలతో ప్రమాణం చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

 

Read More బొల్లారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు

 

Read More బొల్లారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఫ్లైయాష్ తరలింపుతో పాటు ఓవర్ లోడ్ లారీల ద్వారా పొన్నం ప్రభాకర్ అవినీతికి పాల్పడ్డాడని.. సుమారు వంద కోట్ల అవినీతి జరిగిందంటూ కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక మంత్రితో పాటు హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ మీద కూడా ఆరోపణలు చేశాడు కౌశిక్ రెడ్డి.

అయితే దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని తన లాయర్ ద్వారా కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు కూడా పంపించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మంగళవారం రోజున చెల్పూర్ గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ప్రమాణం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ పోలీసులు అక్కడకు వెళ్లకుండా అడ్డుకున్నారు. 

దాంతో తన ఇంటి వద్దనే తడిబట్టలతో ఆంజనేయ స్వామి ఫొటో మీద ప్రమాణం చేసి.. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అవినీతి చేయలేదని ప్రమాణం చేయాలంటూ సవాల్ విసిరారు. అలా చేస్తే పొన్నం ప్రభాకర్ కు తాను క్షమాపణలు చెబుతానని.. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానన్నారు కౌశిక్ రెడ్డి.

 

Read More బొల్లారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు