సోషల్ మీడియాలో మాపై దుష్ప్రచారం: కేటీఆర్

సోషల్ మీడియాలో మాపై దుష్ప్రచారం: కేటీఆర్

ఇవాళ(సోమవారం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ దుయ్యబట్టారు.

కాంగ్రెస్ సోషల్ మీడియాలో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇవాళ(సోమవారం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ దుయ్యబట్టారు.

అదేవిధంగా ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వ పాలన గురించి ఆరు నెలల్లోనే ప్రజలకు అర్థమైందని ఎద్దేవాచేశారు. బీఆర్‌ఎస్ హయాంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు గుర్తుచేశారు. ప్రైవేటు రంగంలో 24లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేసినట్లు తెలిపారు. పదేళ్లలో ఏరాష్ట్రం ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

Read More తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ కార్మిక సంఘం.

ఉద్యోగాల కల్పనపై తాము సరిగ్గా ప్రచారం చేసుకోలేదని చెప్పారు. 65ఏళ్లలో రాష్ట్రానికి వచ్చిన వైద్య కళాశాలలు మూడు మాత్రమేనని వెల్లడించారు. తాము పదేళ్లలో 33 వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని చెప్పారు. వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లినట్లు కేటీఆర్ ఉద్ఘాటించారు.