గీతంలో ఉత్సాహభరితంగా ‘అంతర్జాతీయ సంతోష దినోత్సవం’

గీతంలో ఉత్సాహభరితంగా ‘అంతర్జాతీయ సంతోష దినోత్సవం’

విశ్వంభర, సంగారెడ్డి జిల్లా : అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆనందాన్ని సృష్టించే (క్రాఫ్టింగ్ జాయ్) కార్యక్రమాన్ని గీతం విద్యార్థి విభాగం ఉడాన్ నిర్వహించింది. సృజనాత్మకత, చైతన్యంతో కూడిన ఉత్తేజకరమైన వేడుక కోసం విద్యార్థులను డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ ఒకచోట చేర్చింది. వేడుకలలో భాగంగా, ఫ్లాష్ డ్యాన్స్, బంకమట్టితో బొమ్మల తయారీతో పాటు పుస్తక పఠన కార్యక్రమాలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వీయ వ్యక్తీకరణ, ఇతరులతో తమ అనుభవాలను పంచుకోవడంలో విద్యార్థులు మునిగిపోయారు. నిరాడంబరంగా నృత్యం చేయడం, సంక్లిష్టమైన బంకమట్టి నమూనాలను రూపొందించడం, సున్నితమైన కాగితపు పువ్వులను రూపొందించడం వంటి ప్రతి పని తమ సొంతం అనే భావనను, భావోద్వేగ అనుభూతిని పెంపొందించింది. ప్రశాంతమైన పుస్తకపఠన కార్యక్రమం, అందులో పాల్గొన్న వారిని ఉత్తేజితులను చేయడంతో పాటు స్ఫూర్తిదాయకంగా ఉంచింది.

Tags: