జాతీయస్థాయి వుడ్ బాల్ పోటీలలో తెలంగాణ రాష్ట్ర జట్లు విజయకేతనం

విశ్వంభర, మహారాష్ట్ర /నాగ్ పూర్ : నాగపూర్ జిల్లాలో తేదీ. 22-03-2025 నుండి తేదీ. 26-03-2025 వరకు జరిగిన జాతీయస్థాయి 19వ సీనియర్ , 13 వ సబ్ - జూనియర్ వుడ్ బాల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో తెలంగాణ రాష్ట్ర జట్ల తరఫున మర్రిగూడ సెయింట్ మేరీ పాఠశాలకు చెందిన జి.సారిక, డి నందిని , పి. విగ్నేష్, ఓ. కౌశిక్ , జై పవన్ కుమార్ లు వుడ్ బాల్ టోర్నమెంట్లో అండర్ 15, సబ్ - జూనియర్ బాలికల - సింగిల్ విభాగంలో జి. సారిక , డి. నందిని లు ఫైనల్ లో తెలంగాణ రాష్ట్ర వర్సెస్ గుజరాత్ రాష్ట్రం తో హోరా - హోరీగా పోరాడి తెలంగాణ రాష్ట్ర జట్టు మొదటి స్థానంలో గెలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. అలాగే బాలికల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లో తెలంగాణ జట్టు వర్సెస్ మహారాష్ట్ర రాష్ట్రం జట్లు తలపడగగా తెలంగాణ జట్టు మూడువ స్థానంతో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. అండర్ - 15 సబ్ - జూనియర్ బాలురు - విభాగంలో పి. విగ్నేష్ , ఓ. కౌశిక్ , జె. పవన్ , ఇబ్రహీంపట్నంలోని స్థానిక నాగార్జున హై స్కూల్ పాఠశాలకు చెందిన ఎం. వినయ్, స్థానిక అంగ్లిస్ట్ హై స్కూల్ పాఠశాలకు చెందిన పి.విగ్నేష్ యాదవ్ టీం - ఈవెంట్ - విభాగంలో గోవా జట్టు వర్సెస్ తెలంగాణ రాష్ట్ర జట్టులు హోరా హోరిగా పోరాడి, చివరికి మూడవ స్థానం రజత పతకాన్ని సాధించింది. బంగారు, రజత పతాకాలను సాధించిన క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర వుడ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి. కే. ఆదర్శ్, ఉమ్మడి నలగొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల వుడ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి. ఎండి. రహమత్ లు క్రీడాకారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా వుడ్ బాల, కోచ్ లు ఎం పవన్, బి నవీన్, కే శ్రీను, బి అభినాష్ తదితరులు పాల్గొన్నారు.