అన్నపూర్ణ కాలనీలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం

అన్నపూర్ణ కాలనీలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం

విశ్వంభర, మేడిపల్లి: మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ అన్నపూర్ణ కాలనీలో కాలనీ అధ్యక్షులు ప్రభాకర్ గుప్తా ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు మాట్లాడుతూ అన్నపూర్ణ కాలనీలో ప్రతి ఏటా శ్రీ సీతారాముల కళ్యాణం ఎంతో ఘనంగా నిర్వహించుకుంటామని, ఆ సీతారాముల లాగా ప్రతి ఒక్కరు ధర్మమార్గంలో నడవాలని, వారు అమ్మానాన్నలపై గౌరవం, అన్నదమ్ముల అనుబంధం, పెద్దలపైన మర్యాద, రాజుగా ధర్మబద్ధంగా నడిచే  విధానం ఒక్క సితారాముల లోనే కనిపిస్తాయని అందుకే వారు భారతదేశం వ్యాప్తంగా కొలవబడ్డారని పేర్కొన్నారు. సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించి వారి కళ్యాణాన్ని జరపడం ఎంతో ఆనందంగా ఉందని, వారి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరారు. స్వామివారి కల్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి దాదాపు 2000 మందికి అన్న ప్రసాదం, పానకం వడపప్పు అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ కాలనీ సెక్రటరీ రామకృష్ణ, కమిటీ బాడీ మెంబర్స్, మహిళలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Tags: