సన్ రైజ్ హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యేలు

విశ్వంభర, హనుమకొండ జిల్లా : హనుమకొండ సర్క్యూట్ గెస్ట్ హౌస్ రోడ్డులో డాక్టర్లు మండల రాకేష్ రెడ్డి, పుల్లూరి స్వాతి దంపతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతనంగా ఏర్పాటు చేసిన సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ముఖ్య అతిధులు గా విచ్చేసిన హనుమకొండ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, భూపాల పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్లు మండల రాకేష్ రెడ్డి,పుల్లూరి స్వాతి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు 24 గంటల వైద్యసేవలు ముఖ్యంగా ఎముకలకు సంబంధించిన సమస్యలకు వైద్యం అందిస్తామని తెలిపారు. హాస్పిటల్ ప్రత్యేకతలలో ఆధునిక సౌకర్యాలతో ఐసీయూ, ల్యాబ్, సర్జరీకి సంబందించిన థియేటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పుల్లూరి సంపత్ రావు,ఐ.ఎం.ఏ రాష్ట్ర, జిల్లా డాక్టర్లు,డిఎంహెచ్,వో, వరంగల్ జిల్లా లోని ప్రముఖ వైద్యులు, రాజకీయ నాయకులు,బంధుమిత్రులు,హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.