శ్రీ సీతారామాంజనేయ ఆలయ నిర్మాణానికి రూ. 1,00,116/- విరాళం

15వ డివిజన్ ఇంచార్జ్ సిగురు రేణుకా రవికుమార్
విశ్వంభర, చెంగిచెర్ల: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 15 వ డివిజన్ బి.ఆర్.ఎస్. పార్టీ ఇంచార్జ్ సిగురు రేణుక రవికుమార్ శ్రీ మహాలక్ష్మి నగర్ కాలనీ శ్రీ సీతరామాంజనేయ ఆలయ కమిటీ సభ్యుల అభ్యర్థన మేరకు ఆలయానికి కావాల్సిన గ్రిల్ వర్క్ నిర్మాణం కొరకు 1,00,116 రూపాయల చెక్ ని శ్రీ సీత-రామాంజనేయ ఆలయ కమిటీ సభ్యులకు అందజేసారు.
ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికై తమ వంతు సాయంగా దైవభక్తితో ఆలయ అభివృద్ధి కోసము ధన రూపేనా సహాయం అందించినందుకు రేణుకా రవికుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా సిగురు రేణుకా రవికుమార్ 15వ డివిజన్ లోని వివిధ కాలనీలలో అమ్మసానీ, రాజిరెడ్డి నగర్, అంజయ్య ఇంక్ల్లేవ్, టెలిఫోన్ కాలనీ , బాలచిత్తారి నగర్, క్రాంతి కాలనీలలోని శ్రీ సీతారామ కల్యాణ వేడుకలలో పాల్గొని కళ్యాణం తిలకించడం జరిగింది. ఈ కార్యక్రమములో 15వ డివిజన్ బి.ఆర్.ఎస్.పార్టీ నాయకులు సంతోషి రెడ్డి, ధర్మ సాగర్, గణేష్ గౌడ్, సుదర్శన్ రెడ్డి, చంద్ర రెడ్డి, రాజిరెడ్డి , బాబు రాజ్, కట్టెల వెంకటేష్, రమేష్, కందగట్ల మహేష్, కిషోర్ రెడ్డి , ప్రశాంత్, సుధీర్, రాకేష్ రెడ్డి, మ్యాదరి మహేష్, లక్ష్మి, కర్ణాకర్ రెడ్డి, కుమారాచారి పాల్గొన్నారు.