పాఠశాల ఉపాధ్యాయులకు వీడ్కోలు సభ.
On
కూకట్ పల్లి సర్కిల్, ఎల్లమ్మబండ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉపాధ్యాయుల వీడ్కోలు సభ నిర్వహించారు. యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, ఉపాధ్యాయులను శాలువతో సత్కరించారు. పాఠశాలకు నూతనంగా నియమితులైన ఉపాద్యాయులకు స్వాగతించారు. ఈ సందర్భంగా రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఎల్లమ్మబండ ప్రభుత్వ పాఠశాలలో సేవలందించిన ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు పేరుపేరునా కృతఙ్ఞతలు తెలిపారు. ఉన్నత స్థానాలకు బదిలీ అవ్వుతున్న వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది ఎచ్.ఎమ్ రాధపద్మజ, గోవింద్, కె.కె.మోహన్ రావు, లక్ష్మప్ప, సిద్దయ్య, పండు, విఠల్ గౌడ్, కిరణ్మయి, సంధ్యారాణి, విజయలక్ష్మి, CH. భాస్కర్, పాండుగౌడ్, షౌకత్ అలీ మున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు శివరాజ్ గౌడ్, సయ్యద్, మహేష్, ఫారూఖ్, ఖలీమ్, బషీర్, జనార్దన్, తదితరులు పాల్గొన్నారు.