వారికి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటా: బండి సంజయ్
ఈనాడు గ్రూప్ సంస్థలకు ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కాగా, ఆయన ఇవాళ(గురువారం) కరీంనగర్‌లోని ఈనాడు యూనిట్ కార్యాలయంలో రామోజీ గ్రూపు సంస్థల యజమాని రామోజీరావుకు నివాళులు అర్పించారు.
ఈనాడు గ్రూప్ సంస్థలకు ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కాగా, ఆయన ఇవాళ(గురువారం) కరీంనగర్‌లోని ఈనాడు యూనిట్ కార్యాలయంలో రామోజీ గ్రూపు సంస్థల యజమాని రామోజీరావుకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రామోజీరావుతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
అదేవిధంగా రామోజీరావుతో తనది గురుశిష్యుల బంధమని బండి తెలిపారు. రామోజీరావును కలిసినప్పుడల్లా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునేవాడినని గుర్తుచేశారు. ఈనాడు ఉద్యోగులంటే సమాజంలో గౌరవం ఉంటుందని పేర్కొన్నారు. అందుకు ఆయన అనుసరించే పద్ధతులే కారణమన్నారు. రామోజీరావు మన మధ్య భౌతికంగా లేకపోయినా ఈనాడు రూపంలో మనమధ్యే ఉంటారని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.