ఆ కంపెనీ ఎక్కడికి పోయింది కేటీఆర్..: శ్రీధర్ రెడ్డి సూటి ప్రశ్న

ఆ కంపెనీ ఎక్కడికి పోయింది కేటీఆర్..: శ్రీధర్ రెడ్డి సూటి ప్రశ్న


కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నుంచి కంపెనీలు తరలిపోతున్నాయిన కేటీఆర్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ చెప్పిన కార్నింగ్ అనే సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకోలేదని అన్నారు. అలాంటిది తెలంగాణ నుంచి ఆ కంపెనీ వెళ్లిపోయిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. వెళ్లిపోయాయంటున్న ఆ కంపెనీలు ఎక్కడికి వెళ్లిపోయాయో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.


Read More ప్రభుత్వ, ప్రైవేట్  బ్యాంకుల్లో భద్రతపై   పోలీసుల తనిఖీ

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే తెలంగాణకు పెట్టుబడులు పెరిగాయని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయంలో తెలంగాణకు రూ. 20 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రూ. 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని అన్నారు. ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే మరో రూ. 9 వేల కోట్లు పెట్టుబడులు రానున్నాయని చెప్పారు.

 

ఇక మాజీ మంత్రి హరీష్ రావుకు శ్రీధర్ బాబు కూడా గట్టిగానే కౌంటర్ వేశారు. వరంగల్‌లోని ఎంజీఎంలో హాస్పిటల్‌లో జనరేటర్ ప్రాబ్లమ్ వల్ల పవర్ పోయిందని అన్నారు. అంతేకానీ.. కరెంట్ కోతలు కూడా లేవని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంజీఎంలో 120 సార్లకు పైగా కరెంట్ సమస్య వచ్చిందని గుర్తు చేశారు. పేషేంట్లను ఏకంగా ఎలుకలు కొరికాయని అన్నారు. దీనపై దమ్ముంటే హరీష్ రావు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు.