నేడు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇవాళ(ఆదివారం) విడుదల కానున్నాయి. ఉదయం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇవాళ(ఆదివారం) విడుదల కానున్నాయి. ఉదయం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ముందుగా జూన్ 4న అన్ని రాష్ట్రాల ఫలితాలతో వెల్లడించించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది.
అయితే ఎన్నికల ఫలితాలను రెండు రోజుల ముందు అంటే జూన్ 2న ఓట్ల లెక్కంపు చేసి ఫలితాలు వెల్లడించేందుకు సిద్ధమైంది. ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ కారణం లేకపోలేదు. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీల గడువు జూన్ 2తో ముగుస్తోంది. కాగా జూన్ 4న ఫలితాలు విడుదల చేస్తే జూన్ 2న ప్రభుత్వం రద్దు అవుతుంది.
ఆ రెండు రోజులు అక్కడ ప్రభుత్వం ఉండదు. ఈనేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం 60 స్థానాలు ఉండగా ఇప్పటికే 10 చోట్ల బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. మిగిలిన 50స్థానాలకు నేడు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం 133 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.