రాజ‌కీయాల‌కు లోక్ మంథ‌న్ అతీతం::కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

రాజ‌కీయాల‌కు లోక్ మంథ‌న్ అతీతం::కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

* ఇది సంస్కృతికి సంబంధించిన‌ది
* ప్రారంభించ‌నున్న రాష్ట్రప‌తి ముర్ము 
* పాల్గొననున్న ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహ‌న్ భాగ‌వ‌త్‌
* ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొనాలి

విశ్వంభ‌ర‌, హైద‌రాబాద్‌: భాగ్యనగర్ వేదికగా నాలుగు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న లోక్ మంథన్ రాజ‌కీయాల‌కు అతీతంగా జ‌రుగుతోంద‌ని ఆహ్వాన క‌మిటీ ఛైర్మ‌న్ , కేంద్ర మంత్రి,కిషన్ రెడ్డి  తెలిపారు. ఇది భార‌తీయ  
సంస్కృతికి సంబంధించిన కార్యక్రమ‌మని, దేశానికి ఉపయోగపడేద‌ని అన్నారు. లోక్‌మంథ‌న్ కార్యక్రమాన్ని శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని  ప్రకటించారు. అలాగే మూడు రోజుల పాటు ఆరెస్సెస్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ కూడా పాల్గొంటారని, కుటుంబ వ్యవస్థ, దాని ప్రాధాన్యత, సామాజిక సమరసత, స్వదేశీ తదితర అంశాలపై వారు మార్గదర్శనం చేస్తారని తెలిపారు.లోక్ మంథన్ భాగ్యనగర్ 2024 ఎగ్జిబిషన్ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఈ కార్యక్రమంలో ఎవ్వరు కూడా ప్లాస్టిక్ వస్తువులను వాడొద్దని పిలుపునిచ్చారు. ఈ లోక్ మంథన్ కార్యక్రమానికి ప్రజలందరూ విచ్చేయాలని పిలుపునిచ్చారు.
 ఇందులో  దేశ వ్యాప్తంగా ఉన్న  ప్రముఖం కళాకారులు, మేధావులు,  ఆలోచనాపరులు, పద్మ అవార్డు గ్రహీతలు పాల్గొంటారని తెలిపారు.  2,500 మంది ప్రతినిధులు హాజ‌ర‌వుతార‌ని తెలిపారు.   ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షేకావత్ పాల్గొంటారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Tags: